![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ లో ఎనిమిదవ వారం ఆట సందీప్ ఎలిమినేషన్ అవ్వగా, తొమ్మిదవ వారం టేస్టీ తేజ ఎలిమినేటెడ్ అయ్యాడు. అయితే పదవ వారం ఎవరవుతారనే ఆసక్తి ఇప్పుడు అందరిలో మొదలైంది. గతవారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో చివరగా రతిక, తేజ ఉన్నారు. ఇక రతిక ఎమోషనల్ అయింది. ఈ ఒక్కవారం నాకు ఛాన్స్ ఇవ్వండి సర్ అంటూ నాగార్జునని రిక్వెస్ట్ చేసుకుంది రతిక. నా చేతుల్లో ఏమీ లేదు. ప్రేక్షకులు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారంటూ నాగార్జున చెప్పాడు. దాంతో రతిక ఏడ్చేసింది.
బిగ్ బాస్ సీజన్-7 లో హౌస్ మొత్తంలో వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అని ప్రేక్షకులలో ఎవరిని అడిగినా మొదటగా వచ్చేది శోభాశెట్టి పేరే. ఆ తర్వాత సీరియల్ బ్యాచ్ లోని అమర్ దీప్, ప్రియంక అని చెప్తారు. ప్రస్తుతం రతిక, అశ్వినిశ్రీ కూడా అదే బాటలో వెళ్తున్నారు. గతవారం శోభా శెట్టి లీస్ట్ లో ఉండగా బిగ్ బాస్ తేజని ఎలిమినేషన్ చేసి ఉల్టా పుల్టా అని కవర్ చేసాడు. అయితే ఇది కచ్చితంగా అన్ ఫెయర్ అంటు నెటిజన్లు ట్రోల్స్ చేశారు. శోభాశెట్టిని ఎలాగైనా ఎలిమినేషన్ చేయాలంటూ ట్విట్టర్ లో ఒక ట్రెండే క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
శోభాశెట్టి హౌస్ లో ఆటల్లో గొడవలు పెట్టుకుంటూ, నోరేసుకొని పడిపోతు ఉంది. అయితే గత వారం ఎలిమినేషన్ అవ్వాల్సింది కానీ ఆట సందీప్ అయ్యాడు. తర్వాత తొమ్మిదవ వారం టేస్టీ తేజ అయ్యాడు. నామినేషన్ లో శోభా శెట్టి సిల్లీ రీజన్స్, హౌస్ మేట్స్ లలో ప్రియంక, అమర్ దీప్ లతో సరదాగా ఉండి, మిగతా వారితో అంత చనువు లేకపోవడంతో అందరి దృష్ణిలో శోభాశెట్టి బ్యాడ్ అయింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు టేస్టి తేజ, ప్రియాంక, అమర్ దీప్ లతో ఎక్కువగా ఉంది శోభాశెట్టి. రోజుకి 30 నుంచి 40 వేల చొప్పున వారానికి గాను 2 నుంచి 3 లక్షల వరకు శోభాశెట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే తేజది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ శోభాశెట్టిని కావాలనే సేవ్ చేశారంటూ గత వారం నుండి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
![]() |
![]() |